Secunderabad Case: సికింద్రాబాద్ లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

13 Year Old Girl Gang Raped in Secunderabad
  • సికింద్రాబాద్ లాడ్జిలో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
  • నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు గుర్తింపు
  • సంగారెడ్డిలో అదృశ్యమైన బాలికను మాయమాటలతో లాడ్జికి తరలింపు
సికింద్రాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 13 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఓ లాడ్జిలో బాలికతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు 19 ఏళ్ల యువకులు కాగా, మరో ఇద్దరు 17 ఏళ్ల మైనర్లు ఉన్నట్లు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బాలిక ఈ నెల 4వ తేదీన అదృశ్యమైంది. దీంతో ఆందోళనకు గురైన బాలిక తల్లి, తమ కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, బాలిక సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌పై దృష్టి సారించారు. సిగ్నల్స్ ఆధారంగా బాలిక సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జిలో ఉన్నట్లు గుర్తించి, వెంటనే అక్కడికి చేరుకుని నిందితులను అరెస్ట్ చేశారు.

ఈ నెల 8న సికింద్రాబాద్ బస్ స్టేషన్ వద్ద ఒంటరిగా ఉన్న బాలికను గమనించిన నిందితులు, ఆమెకు మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Secunderabad Case
Secunderabad
Gang Rape
Telangana Crime
POCSO Act
Minor Girl
Sangareddy
Crime News
Hyderabad Crime
Cyberabad Police

More Telugu News