: సర్పంచ్ అభ్యర్థి కోసం అల్లు అర్జున్ ప్రచారం.. అంతా ఏఐ మాయ!

––
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. సినీ స్టార్ల అభిమానులను ఆకట్టుకోవడానికి సాంకేతికతను ఉపయోగించి వీడియోలు రూపొందిస్తున్నారు. అభిమాన నటుడి వీడియోతో తమకు ఓటేయాలని ప్రచారం చేస్తున్నారు. మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో ఓ సర్పంచ్ అభ్యర్థి అల్లు అర్జున్ వీడియోతో తనకు ఓటేయాలని కోరుతున్నాడు.

ఎన్నికల సంఘం తనకు కేటాయించిన కత్తెర గుర్తుతో అల్లు అర్జున్ తన కోసం ప్రచారం చేస్తున్నట్లు ఏఐతో ఓ ఫొటో రూపొందించాడు. కత్తెర గుర్తు జెండా ఎగురుతుండగా తెల్ల చొక్కా, దానిపై కత్తెర బొమ్మతో ఉన్న అల్లు అర్జున్ ఫొటో ఇప్పుడు వాట్సాప్ లో చక్కర్లు కొడుతోంది.

More Telugu News