మీరేమీ పతివ్రతలు కాదు కదా?.. సమంతపై ట్రోలింగ్‌పై మాధవీలత ఫైర్
- సమంత రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ
- కొనసాగుతున్న విమర్శలు, ట్రోలింగ్
- సమంతకు మద్దతుగా రంగంలోకి దిగిన మాధవీలత
స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమె పెళ్లిపై సోషల్ మీడియాలో కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత ఘాటుగా స్పందించారు. సమంత వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
“సమంత పెళ్లి చేసుకుంటే కొందరికి ఎందుకంత బాధ? ఆమె ఎవరిదో సంసారాన్ని కూల్చినట్లు మాట్లాడుతున్నారు. ఇలాంటి కామెంట్లు చేసేవారు ముందు తమ సంబంధాల గురించి ఆలోచించుకోవాలి” అని మాధవీలత హితవు పలికారు. “ఒకరి పెళ్లి చెడగొట్టి పెళ్లి చేసుకున్నవాళ్లు, విడాకులు ఇవ్వకుండా సంబంధాలు నడిపేవాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే నవ్వొస్తోంది. మీరేమీ పతివ్రతలు కాదు కదా?” అంటూ విమర్శకులను సూటిగా ప్రశ్నించారు.
పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయని, రుణాలు తీరిపోతే విడిపోతారని మాధవీలత వ్యాఖ్యానించారు. “ఒకరినొకరు చంపుకోవడం లేదు కదా? ఆ విషయంలో సంతోషించండి” అని ఆమె అన్నారు. సమంతపై అనవసరంగా విమర్శలు చేయడం తగదని స్పష్టం చేశారు.