తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురి మృతి
- ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- జైనథ్ మండలం వద్ద అదుపుతప్పి బోల్తాపడ్డ కారు
- మహారాష్ట్ర నుంచి తిరిగొస్తుండగా జరిగిన దుర్ఘటన
ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జైనథ్ మండలం, తరోడ గ్రామ సమీపంలో వేగంగా వెళ్తున్న ఒక కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతులను ఆదిలాబాద్ పట్టణంలోని జైజవాన్ నగర్, లక్ష్మీనగర్ వాసులుగా గుర్తించారు. వీరంతా ఉపాధి నిమిత్తం మహారాష్ట్రకు మేస్త్రీ పనుల కోసం వెళ్లి, పని ముగించుకుని కారులో తిరిగి స్వస్థలానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.