గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం: ఢిల్లీలో చిక్కిన యజమాని అజయ్ గుప్తా

Ajay Gupta Arrested in Delhi for Goa Nightclub Fire
  • ఢిల్లీలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే అజయ్ గుప్తా అరెస్ట్ 
  • మరో ఓనర్ కోసం లుక్-అవుట్ సర్క్యులర్
  • ఇద్దరు థాయ్‌లాండ్‌కు పరారీ
  • అదే యాజమాన్యానికి చెందిన మరో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసిన అధికారులు
గోవాలోని ఓ నైట్‌క్లబ్‌లో 25 మందిని బలిగొన్న భారీ అగ్నిప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న 'బిర్చ్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్ సహ యజమానుల్లో ఒకరైన అజయ్ గుప్తాను పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇది ఆరవ అరెస్ట్ అని గోవా పోలీసులు వెల్లడించారు.

అజయ్ గుప్తా కోసం పోలీసులు లుక్-అవుట్ సర్క్యులర్ (LOC) జారీ చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో ఆచూకీ లభించకపోవడంతో గాలింపు ముమ్మరం చేశారు. వెన్నునొప్పి కారణంగా లాజ్‌పత్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు తెలియడంతో, డిశ్చార్జ్ అయిన వెంటనే గోవా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నేడు కోర్టులో హాజరుపరిచి, ట్రాన్సిట్ రిమాండ్‌పై గోవాకు తరలించనున్నారు.

ఈ కేసులో మరో సహ యజమాని సురీందర్ కుమార్ ఖోస్లాపై కూడా లుక్-అవుట్ సర్క్యులర్ జారీ అయింది. మిగిలిన ఇద్దరు యజమానులు సౌరభ్, గౌరవ్ లూథ్రా సోదరులు ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు పారిపోయినట్లు గుర్తించారు. వారిపై బ్లూ కార్నర్ నోటీసు జారీ చేశారు. పరారీలో ఉంటూనే, సౌరభ్ లూథ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఘటనపై విచారం వ్యక్తం చేయడం గమనార్హం.

ఈ ఘటన నేపథ్యంలో ఇదే యాజమాన్యానికి చెందిన వాగేటర్ బీచ్‌లోని మరో 'రోమియో లేన్' ప్రాపర్టీలో కూడా భద్రతా నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ భూమిలో దానిని అక్రమంగా నిర్మించడంతో, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆదేశాల మేరకు మంగళవారం ఆ భవనాన్ని కూల్చివేశారు.
Go Back to Shorts
Ajay Gupta
Goa nightclub fire
Romeo Lane
Delhi arrest
Surinder Kumar Khosla
Saurabh Luthra
nightclub fire India
Goa fire accident
Promod Sawant
illegal construction demolition

More Telugu News