తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళం ఇచ్చిన చెన్నై భక్తురాలు

  • చెన్నైకు చెందిన సౌమ్య అనే భక్తురాలి ఉదారత
  • నిత్యాన్నదానం, ప్రాణదానం ట్రస్టులకు చెరో రూ. 50 లక్షలు
  • దాతను సత్కరించి, ప్రత్యేక దర్శనం కల్పించిన టీటీడీ
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ట్రస్టులకు ఓ భక్తురాలు భారీ విరాళం అందజేశారు. చెన్నైలోని ఈరోడ్‌కు చెందిన సౌమ్య అనే భక్తురాలు ఏకంగా రూ. కోటి విరాళం ప్రకటించి తన భక్తిని చాటుకున్నారు. ఈ మేరకు ఆమె విరాళానికి సంబంధించిన చెక్కును టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.
 
ఈ విరాళాన్ని రెండు కీలకమైన ట్రస్టులకు సమానంగా విభజించి ఇచ్చారు. శ్రీవారి నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు రూ.50 లక్షలు, ప్రాణదానం ట్రస్టుకు మరో రూ.50 లక్షల చొప్పున విరాళంగా అందించారు. భక్తురాలి ఉదారతకు టీటీడీ తరఫున అదనపు ఈవో వెంకయ్య చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దాత సౌమ్యను శాలువాతో సత్కరించారు. అనంతరం ఆమెకు స్వామివారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
 
ఈ కార్యక్రమంలో తిరుపతికి చెందిన టీడీపీ నేత కోడూరు బాలసుబ్రహ్మణ్యం కూడా పాల్గొన్నారు. స్వామివారి సేవలకు భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించడం అభినందనీయమని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.


More Telugu News