Revanth Reddy: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో 3,000 డ్రోన్‌లతో షో.. గిన్నిస్ రికార్డు

Revanth Reddy Telangana Global Summit Drone Show Sets Guinness Record
  • ముగింపు వేడుకలో ఆకట్టుకున్న డ్రోన్ షో
  • తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను వివరించే థీమ్‌లతో డ్రోన్ షో
  • అబుదాబిలో 2,131 డ్రోన్‌లతో ప్రదర్శన.. అధిగమించిన తెలంగాణ రైజింగ్ డ్రోన్ షో
'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'లో భారీ డ్రోన్ షో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ సదస్సు ముగింపు వేడుకలో ఏర్పాటు చేసిన డ్రోన్ షో చూపరులందరినీ విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యాలను వివరిస్తూ ప్రత్యేక థీమ్‌లతో ఈ డ్రోన్ షోను రూపొందించారు.

గిన్నిస్ బుక్ రికార్డును నమోదు చేసేలా మొత్తం 3 వేల డ్రోన్‌లతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. గతంలో అబుదాబిలో 2,131 డ్రోన్‌లతో నిర్వహించిన ప్రదర్శన గిన్నిస్ బుక్ రికార్డును సాధించింది. ఇప్పుడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సులో ఆ రికార్డును అధిగమించేలా 3 వేల డ్రోన్లతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేయడం విశేషం.

ఈ కార్యక్రమానికి హాజరైన గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రికార్డు సర్టిఫికెట్ ను అందజేశారు. ముగింపు వేడుకల సందర్భంగా బాణాసంచా వెలుగులతో గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం శోభాయమానంగా వెలిగిపోయింది.
Revanth Reddy
Telangana Rising Global Summit
Drone Show
Guinness World Record
Telangana

More Telugu News