AP Lorry Owners Association: ఏపీలో లారీ ఓనర్ల సమ్మె తాత్కాలికంగా వాయిదా

AP Lorry Owners Strike Temporarily Postponed
  • ఫిట్‌నెస్ చార్జీల పెంపును నిరసిస్తూ సమ్మెకు పిలుపునిచ్చిన లారీ ఓనర్ల సంఘం
  • ప్రభుత్వంతో జరిపిన చర్చలు విజయవంతం
  • ప్రజలకు ఇబ్బందులు కలగకుండా... ప్రభుత్వం చొరవ
ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం అర్ధరాత్రి నుంచి జరగాల్సిన లారీల సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఇరు వర్గాల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి.

లారీల ఫిట్‌నెస్ చార్జీలను ప్రభుత్వం పెంచడాన్ని నిరసిస్తూ లారీ ఓనర్ల సంఘం సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సమ్మెలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని రవాణా వాహనాలను ఈ అర్ధరాత్రి నుంచి నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నివారించేందుకు కూటమి ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది.

లారీ ఓనర్ల అసోసియేషన్ నేతలను చర్చలకు ఆహ్వానించి, వారి సమస్యలను అడిగి తెలుసుకుంది. ప్రభుత్వ సానుకూల స్పందనతో లారీ యజమానుల సంఘం తమ సమ్మెను తాత్కాలికంగా విరమించుకుంది. దీంతో రాష్ట్రంలో రవాణా సేవలకు ఎదురవబోయే పెద్ద ఆటంకం తప్పినట్లయింది.
AP Lorry Owners Association
Andhra Pradesh
lorry owners strike
lorry strike postponed
transportation strike
AP government
lorry fitness charges
Vijayawada
transport department

More Telugu News