Tirumala SriVari: పరకామణి చోరీ కేసు: హైకోర్టుకు సీల్డ్ కవర్‌లో సీఐడీ అదనపు నివేదిక

Tirumala SriVari Parakamani Theft Case CID Submits Additional Report to High Court
  • టీటీడీ మాజీ ఉద్యోగి విదేశీ కరెన్సీ చోరీ చేసిన కేసు
  • రూ.14 కోట్ల ఆస్తుల విరాళంతో కేసు రాజీపై ఆరోపణలు
  • ఫిర్యాదుదారు అనుమానాస్పద మృతితో పెరిగిన కేసు తీవ్రత
తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసులో లోక్ అదాలత్ ద్వారా కుదిరిన రాజీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ ఈరోజు హైకోర్టుకు అదనపు నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించింది.

ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. సీఐడీ సమర్పించిన నివేదికకు చెందిన మరో రెండు సెట్లను రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) కు సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని ఆదేశించింది. ఈ నివేదికలను పరిశీలన నిమిత్తం తమ ముందు ఉంచాలని రిజిస్ట్రీకి సూచించింది. లోక్ అదాలత్ అవార్డు చట్టబద్ధతపైనే ప్రధానంగా దృష్టి సారించిన న్యాయస్థానం, నివేదికను పరిశీలించాక తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

గత ఏడాది ఏప్రిల్‌లో టీటీడీ మాజీ ఉద్యోగి రవికుమార్ సుమారు 900 అమెరికన్ డాలర్ల విదేశీ కరెన్సీని చోరీ చేస్తూ పట్టుబడ్డారు. అయితే, 2023 సెప్టెంబర్‌లో ఈ కేసు అనూహ్యంగా లోక్ అదాలత్‌లో రాజీకి వచ్చింది. ఈ రాజీలో భాగంగా నిందితుడు రవికుమార్ రూ.14 కోట్ల విలువైన ఏడు ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ రాజీని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో న్యాయస్థానం సీఐడీ, ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించింది. మరోవైపు, ఈ కేసులో తొలుత ఫిర్యాదు చేసిన అప్పటి ఏవీఎస్ఓ సతీశ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మరణించడం కేసు తీవ్రతను మరింత పెంచింది.
Tirumala SriVari
Parakamani theft case
Andhra Pradesh High Court
CID investigation
Lok Adalat
TTD
Ravi Kumar
Satish Kumar
TTD properties

More Telugu News