Tirupati Eat Street: తిరుపతి నగరంలో ఈట్ స్ట్రీట్.. రెడీ అవుతున్న ఫుడ్ కోర్ట్!

Tirupati Eat Street Food Court Ready Soon
  • తిరుపతిలో వేగంగా ఈట్ స్ట్రీట్ నిర్మాణ పనులు
  • నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఏర్పాటు
  • రెండు నెలల్లో అందుబాటులోకి తేనున్న అధికారులు
  • రూ.80 లక్షల అంచనా వ్యయంతో ఫుడ్ కోర్ట్ నిర్మాణం
  • టెండర్ల ద్వారా 40 నుంచి 50 స్టాళ్ల కేటాయింపు
తిరుపతి నగరవాసులు, భక్తులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘ఈట్ స్ట్రీట్’ (ఫుడ్ కోర్ట్) కల త్వరలోనే నెరవేరనుంది. నగరపాలక సంస్థ ప్రస్తుత కార్యాలయానికి ఎదురుగా ఉన్న అచ్యుత దేవరాయలు మార్గంలో ఫుడ్ కోర్ట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో దీనిని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ ఫుడ్ కోర్ట్‌లో మొత్తం 40 నుంచి 50 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 8/16 సైజులో ఉన్న 12 కంటైనర్లను ఆధునిక స్టాళ్లుగా మారుస్తున్నారు. మిగిలిన ఖాళీ స్థలాలను టెండర్ దక్కించుకున్న వారు స్టాళ్లుగా అభివృద్ధి చేసుకునేందుకు అనుమతిస్తారు. దాదాపు రూ.80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు నగరపాలక సంస్థ కౌన్సిల్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. పనులు పూర్తయిన తర్వాత టెండర్ల ప్రక్రియ ద్వారా స్టాళ్లను కేటాయించనున్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కపిలతీర్థం రోడ్డు, ఆర్టీసీ బస్టాండు వంటి ప్రాంతాల్లో ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగినా అవి కార్యరూపం దాల్చలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కమిషనర్ మౌర్య ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో పనుల్లో వేగం పెరిగింది. నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తులకు, స్థానికులకు ఈ ఫుడ్ కోర్ట్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు.
Tirupati Eat Street
Tirupati
Eat Street
Food Court
Achuta Devarayalu Margam
Kapila Theertham Road
RTC Bus Stand
Andhra Pradesh Tourism
Mourya
YCP Government

More Telugu News