CPI Narayana: ఇండిగోను తక్షణమే జాతీయం చేయండి: సీపీఐ నారాయణ

CPI Narayana Demands Nationalization of IndiGo Airlines
  • విమానాల రద్దు, ఆలస్యంపై ఇండిగోకు కేంద్రం షాక్
  • ఫ్లైట్ స్లాట్లలో 5 శాతం కోత విధించిన డీజీసీఏ
  • ఇండిగో యాజమాన్యం బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందన్న నారాయణ
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా వందలాది విమానాలను రద్దు చేయడం, ఆలస్యంగా నడపడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇండిగోకు కేటాయించిన స్లాట్లలో 5 శాతం మేర కోత విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

డీజీసీఏ తాజా నిర్ణయంతో ఇండిగో నడిపే విమానాల సంఖ్యలో సుమారు 110 సర్వీసులు తగ్గే అవకాశం ఉంది. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, ఇండిగో వైఖరిపై రాజకీయ నేతల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సీపీఐ అగ్రనేత నారాయణ ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. ఇండిగో సంస్థను తక్షణమే జాతీయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రయాణికుల భద్రత కోసం కేంద్రం విధించిన నిబంధనలను పాటించకుండా ఇండిగో యాజమాన్యం బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. పౌర విమానయాన రంగంలో ఇండిగోకు 64 శాతం వాటా ఉందని, ప్రభుత్వ రంగంలో విమానయాన సంస్థలు లేకపోవడం వల్లే ఇలాంటి సంక్షోభాలు తలెత్తుతున్నాయని నారాయణ విమర్శించారు.
CPI Narayana
IndiGo
IndiGo Airlines
privatization
nationalization
DGCA
flight cancellations
airline crisis
civil aviation
passenger safety

More Telugu News