Raashi Singh: కాలేజీ రోజుల్లో లెక్చరర్ తో ప్రేమలో పడ్డాను: హీరోయిన్ రాశీ సింగ్

Raashi Singh Fell in Love With Lecturer During College Days
  • ఆయనే తన ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్ అని వెల్లడి
  • తనను వైవా ప్రశ్నలు అడిగేవాడు కాదన్న రాశీ సింగ్
  • ఆయనకు పెళ్లైనా ఇప్పటికి ఇన్స్టాలో ఫాలో అవుతున్నాడని వెల్లడి
యంగ్ హీరోయిన్ రాశీ సింగ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. కాలేజీ రోజుల్లో తన లెక్చరర్‌తోనే ప్రేమలో పడ్డానని, ఆయనే తన ఫస్ట్ క్రష్ అని ఆమె వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

రాశీ సింగ్ మాట్లాడుతూ, “కాలేజీలో మా లెక్చరర్‌తో ప్రేమలో పడ్డాను. ఆయన చూడటానికి చాలా యంగ్‌గా, అందంగా ఉండేవారు. చదువులో నాకు ఎంతో సహాయం చేసేవారు. వైవా సమయంలో నన్ను ప్రశ్నలు అడిగేవాడు కాదు. రూమ్‌లో సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్లం. ఆయనే నా ఫస్ట్ లవ్. అయితే మా ప్రేమలో మేం ఎప్పుడూ హద్దులు దాటలేదు” అని తెలిపారు.

ప్రస్తుతం ఆ లెక్చరర్‌కు వివాహం జరిగిందని, అయినా ఇప్పటికీ తనను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. తన ప్రేమ విషయంపై రాశీ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆది సాయికుమార్ హీరోగా 2021లో వచ్చిన ‘శశి’ చిత్రంతో రాశీ సింగ్ హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’, ‘ప్రేమ్ కుమార్’, ‘ప్రసన్న వదనం’ వంటి చిత్రాల్లో నటించి తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
Raashi Singh
Raashi Singh actress
Telugu actress
college love
first crush
lecturer love
Sashi movie
Adithya Sai Kumar
Prasanna Vadanam movie

More Telugu News