Rashmika Mandanna: ప్రపంచాన్ని చుట్టేయండి: స్ఫూర్తిదాయక సందేశంతో రష్మిక కొత్త ఫొటోలు

Rashmika Mandanna Shares Inspiring Message with New Travel Photos
  • తన తాజా ట్రిప్ విశేషాలను పంచుకు రష్మిక
  • వైట్ డ్రెస్‌లో ఉన్న తన ట్రావెల్ ఫోటోలను అభిమానులతో పంచుకున్న నటి
  • ఆడవారి శక్తి అసామాన్యమంటూ ఇటీవల రష్మిక చేసిన పోస్ట్ కూడా వైరల్ 
ప్రముఖ నటి రష్మిక మందన్న తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులకు తన తాజా ట్రిప్ విశేషాలను పంచుకున్నారు. అందమైన ఫోటోలతో పాటు జీవితంపై స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. తెల్లటి దుస్తులు ధరించి, తలలో తెల్లటి పువ్వు పెట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ రష్మిక ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ రాశారు. "ప్రపంచాన్ని చుట్టేయండి. అన్వేషించండి. తప్పులు చేయండి, మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ప్రేమించండి. బిగ్గరగా నవ్వండి. సంతోషంగా జీవించండి. మీ జీవితాన్ని, ఇతరులను, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. దయతో ఉండండి" అంటూ తన ఫ్యాన్స్‌కు స్ఫూర్తినిచ్చారు.

   
ఇటీవల రష్మిక నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రశంసలు కురిపించారు. సినిమాలోని ఒక కీలక సన్నివేశాన్ని షేర్ చేస్తూ "తప్పక చూడాల్సిన సినిమా" అని పేర్కొన్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామాలో రష్మిక నటనకు విమర్శకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి.

    
రష్మిక అప్పుడప్పుడు తన పోస్టులతో అభిమానులను ఆలోచింపజేస్తుంటారు. కొన్ని రోజుల క్రితం ‘ఫెమినిన్ ఎనర్జీ’ గురించి ఆమె చేసిన పోస్ట్ కూడా బాగా వైరల్ అయింది. మహిళలు ఒకరికొకరు తోడుగా నిలిస్తే అద్భుతాలు చేయగలరని, వారి శక్తి అన్‌స్టాపబుల్ అని ఆమె ఆ పోస్టులో అభిప్రాయపడ్డారు.

   
Rashmika Mandanna
Rashmika
The Girlfriend
Janhvi Kapoor
Rahul Ravindran
Telugu cinema
Bollywood
actress
travel
inspiration

More Telugu News