స్క్రబ్ టైఫస్ కలకలం... ఏపీ ప్రభుత్వం ఏం చెబుతోందంటే...!
- ఏపీలో కలవరపెడుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు
- ఈ ఏడాది ఇప్పటివరకు 1,566 మందికి వ్యాధి నిర్ధారణ
- రాష్ట్రవ్యాప్తంగా 9 అనుమానిత మరణాలు నమోదు
- చికిత్స అందుబాటులో ఉందన్న ఆరోగ్యశాఖ
- జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచన
ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటివరకు 1,566 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 9 అనుమానిత మరణాలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది ప్రాణాంతక వ్యాధి కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వైద్య కుటుంబ సంక్షేమ కమిషనర్ ఈ విషయంపై మాట్లాడుతూ, "స్క్రబ్ టైఫస్ అనేది పేడ పురుగు ద్వారా వ్యాపించే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం శీతాకాలంలో కనిపిస్తుంది. వ్యాధిని ముందుగా గుర్తిస్తే యాంటీబయాటిక్స్ ద్వారా సులభంగా నయం చేయవచ్చు. మరణాలకు కేవలం ఈ బ్యాక్టీరియా మాత్రమే కారణం కాదు, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. దీనిపై జీనోమ్ ల్యాబ్స్ ద్వారా విశ్లేషణ చేయిస్తున్నాం" అని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ల్యాబ్‌లలో పరీక్షలకు అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు.
మరోవైపు, గుంటూరు జీజీహెచ్‌లో స్క్రబ్ టైఫస్ అనుమానిత లక్షణాలతో నలుగురు మరణించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. మరణాలకు గల కచ్చితమైన కారణాలను విశ్లేషిస్తున్నామని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతర బాధితులు కోలుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
జ్వరం వచ్చిన వారు వెంటనే వైద్యులను సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది. వ్యాధి లక్షణాలు 5 నుంచి 20 రోజుల్లో బయటపడతాయని, వైద్యుల సలహా మేరకే మందులు వాడాలని స్పష్టం చేసింది.