Renuka Chowdhury: రేణుకా చౌదరి శునకం వివాదం.. ప్రివిలేజ్ కమిటీకి చేరిన వ్యవహారం

Renuka Chowdhury Dog Controversy Reaches Privilege Committee
  • రేణుకా చౌదరి శునకం వివాదంపై బీజేపీ సీరియస్
  •  రాజ్యసభ చైర్మన్‌కు ప్రివిలేజ్ నోటీసులు అందజేత 
  •  విచారణ కోసం ప్రివిలేజ్ కమిటీకి పంపిన చైర్మన్
  •  పార్లమెంటుకు శునకాన్ని తీసుకురావడంతో రాజుకున్న వివాదం
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిపై వచ్చిన హక్కుల ఉల్లంఘన నోటీసును రాజ్యసభ ఛైర్మన్ ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. పార్లమెంట్ ప్రాంగణంలోకి శునకాన్ని తీసుకువచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ సభ్యులు ఇచ్చిన నోటీసుపై విచారణ జరపాలని కమిటీని ఆదేశించారు.

ఇటీవల పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజున రేణుకా చౌదరి తన వాహనంలో ఓ శునకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె ప్రవర్తన సభా హక్కులను ఉల్లంఘించడమేనని ఆరోపిస్తూ బీజేపీ సభ్యులు బ్రిజ్ లాల్, ఇందు బాలగోస్వామి రాజ్యసభ ఛైర్మన్‌కు ప్రివిలేజ్ నోటీసులు అందజేశారు.

ఈ నోటీసును పరిశీలించిన ఛైర్మన్, తదుపరి విచారణ నిమిత్తం హక్కుల కమిటీకి (ప్రివిలేజ్ కమిటీ) పంపారు. ఈ కమిటీ రేణుకా చౌదరి వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపి, తన సిఫారసులతో కూడిన నివేదికను ఛైర్మన్‌కు సమర్పించనుంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఈ వివాదంలో తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది. 
Renuka Chowdhury
Renuka Chowdhury dog
Rajya Sabha
Privilege Committee
Parliament
BJP MPs
Privilege notice
Indu Bala Goswami
Brij Lal

More Telugu News