: ఆమనగల్ లో పిచ్చి కుక్క దాడి.. కొట్టి చంపిన స్థానికులు.. వీడియో ఇదిగో!

––
రంగారెడ్డి జిల్లాలో పిచ్చి కుక్క ఒకేరోజు 36 మందిపై దాడి చేసింది. జిల్లాలోని ఆమనగల్ పట్టణంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పిచ్చి కుక్క స్వైర విహారంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రోడ్డుపై కనిపించిన వారినల్లా కరచుకుంటూ వెళ్లిందని చెప్పారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆ కుక్కను కొట్టి చంపారు. కుక్క దాడిలో గాయపడిన 36 మందిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేసి పంపించినట్లు వైద్యులు తెలిపారు.

More Telugu News