Salman Khan: బిగ్ బాస్ షోలో కన్నీళ్లు పెట్టుకున్న సల్మాన్ ఖాన్

Salman Khan Gets Emotional Remembering Dharmendra
  • దివంగత నటుడు ధర్మేంద్రను గుర్తుచేసుకుని భావోద్వేగం
  • ధర్మేంద్ర పాత వీడియో చూసి బోరున విలపించిన సల్మాన్
  • తన పుట్టినరోజు నాడే ఆయన మరణించడం బాధించిందన్న కండల వీరుడు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కంటతడి పెట్టుకున్నారు. తాను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్ బాస్ వేదికపై దివంగత నటుడు ధర్మేంద్రను గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. షోలో భాగంగా ఇటీవల మరణించిన ధర్మేంద్రకు సంతాపం తెలిపారు. ఆ తర్వాత, గతంలో ధర్మేంద్ర బిగ్ బాస్ షోకి వచ్చినప్పటి వీడియోను ప్రసారం చేయగా, దాన్ని చూసి సల్మాన్ తన ఆవేదనను ఆపుకోలేకపోయారు. చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చేశారు.

ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ, "మనం హీమ్యాన్‌ను కోల్పోయాం. ఆయన కంటే గొప్ప నటుడు లేరని నేను భావిస్తున్నా. మిస్ యూ ధర్మేంద్ర జీ. నా పుట్టినరోజు నాడే మీరు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం నన్ను మరింత బాధించింది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా కనిపించే సల్మాన్ ఖాన్ ఇలా బహిరంగంగా ఏడవడం చూసి ఆయన అభిమానులు ఆశ్చర్యపోయారు. బిగ్ బాస్ షోలో సల్మాన్‌ను సీరియస్‌గానో, సరదాగానో చూశాం కానీ, ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం ఎప్పుడూ చూడలేదని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
Salman Khan
Bigg Boss
Dharmendra
Bollywood
Hindi Bigg Boss
Salman Khan emotional
actor Dharmendra death
Salman Khan cries
He-Man
Bollywood actor

More Telugu News