Gold Price: స్థిరంగా బంగారం ధరలు.. స్వల్పంగా పెరిగిన వెండి.. నేటి రేట్లు ఇవే!

Gold Price Stable Silver Rate Increased Today
  • కొంతకాలంగా పెరుగుతున్న బంగారం ధరకు బ్రేక్
  • సోమవారం స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధరలు
  • కేజీ వెండిపై రూ.100 మేర పెరుగుదల నమోదు
  • ప్రధాన నగరాల్లో బంగారం, వెండి తాజా రేట్ల వివరాలు
గత కొంతకాలంగా పెరుగుతున్న బంగారం ధరలకు సోమవారం స్వస్తి పలికింది. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, వెండి ధర స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. దీనికి తోడు డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం కూడా పసిడి ధరలు అధిక స్థాయిలో నిలకడగా ఉండటానికి కారణంగా భావిస్తున్నారు.

సోమవారం (డిసెంబర్ 8) ఉదయం మార్కెట్ ధర ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,30,140 వద్ద స్థిరంగా ఉంది. అదేవిధంగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,19,300గా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ. 1,30,290 పలుకుతుండగా, 22 క్యారెట్ల బంగారం రూ. 1,19,440 వద్ద ఉంది. ముంబై, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

మరోవైపు వెండి ధరలో స్వల్ప పెరుగుదల కనిపించింది. నిన్నటితో పోలిస్తే కేజీ వెండిపై రూ.100 పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడలలో కేజీ వెండి ధర రూ. 1,95,800కి చేరింది. అయితే ఢిల్లీ, ముంబైలలో దీని ధర రూ. 1,89,900గా ఉంది. బంగారం, వెండి ధరలు ప్రాంతాన్ని బట్టి, పన్నులను బట్టి మారుతుంటాయి. కొనుగోలుదారులు ఈ విషయాన్ని గమనించి, తాజా ధరలను తెలుసుకున్న తర్వాతే కొనుగోలు చేయడం మంచిది. 
Gold Price
Gold Rates
Silver Price
Hyderabad
Vijayawada
Delhi
Mumbai
Commodity Market
Rupee Dollar Exchange Rate

More Telugu News