Smriti Mandhana: స్మృతి మంధానతో పెళ్లి రద్దు... స్పందించిన పలాశ్ ముచ్చల్!

Palash Muchhal Responds to Smriti Mandhana Wedding Cancellation
  • పెళ్లి రద్దుపై ఇన్ స్టాగ్రామ్ లో పలాశ్ ముచ్చల్ ప్రకటన
  • ఈ వ్యక్తిగత సంబంధం నుంచి బయటికి వస్తున్నానని వెల్లడి
  • తానెవరినీ మోసం చేయలేదని స్పష్టీకరణ
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో తన వివాహం రద్దయిన నేపథ్యంలో సంగీత దర్శకుడు, ఫిల్మ్ మేకర్ పలాశ్ ముచ్చల్ స్పందించారు. ఈ వ్యక్తిగత సంబంధం నుంచి బయటికి వచ్చానని, ఇక తాను ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తనపై వస్తున్న మోసం ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.

ఈ మేరకు పలాశ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ప్రకటన విడుదల చేశారు. తనపై ఇటీవల వస్తున్న మోసం ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అవి అవాస్తవాలని కొట్టిపారేశారు. "నాపై వస్తున్న వదంతులను నిజమని నమ్మేవారిని చూస్తుంటే చాలా బాధగా ఉంది. కేవలం ఊహాగానాల ఆధారంగా ఒకరిపై నిర్ణయానికి రావడం సరికాదు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో, తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారికి పలాశ్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. "నా గురించి, నా కుటుంబం గురించి నిరాధారమైన అబద్ధాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను" అని ఆయన స్పష్టం చేశారు. స్మృతి మంధాన తమ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన వెంటనే పలాశ్ ఈ వివరణ ఇవ్వడం గమనార్హం.
Smriti Mandhana
Palash Muchhal
Smriti Mandhana wedding
Palash Muchhal statement
Indian women cricket
Bollywood music director
Fake news
Defamation
Legal action
Celebrity news

More Telugu News