Mallu Bhatti Vikramarka: మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో చిరంజీవి, నాగార్జున

Chiranjeevi and Nagarjuna Meet Mallu Bhatti Vikramarka
  • ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చిరంజీవి, నాగార్జున భేటీ
  • తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఇద్దరు అగ్ర నటులను ఆహ్వానించిన భట్టి
  • ఈ సమ్మిట్ తెలంగాణ భవిష్యత్తుకు కీలకమని తెలిపిన ఉప ముఖ్యమంత్రి
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర నటులు చిరంజీవి, అక్కినేని నాగార్జున తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో ఆయన అధికారిక నివాసం ప్రజా భవన్ లో భేటీ అయ్యారు. ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు వారిని ప్రభుత్వం తరపున భట్టి విక్రమార్క సాదరంగా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎంను కలిసేందుకు చిరంజీవి, నాగార్జున వెళ్లారు.

ఈ భేటీ అనంతరం మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమని ఆయన అన్నారు. "మా విజన్ డాక్యుమెంట్ ద్వారా ప్రపంచం దృష్టిని తెలంగాణ వైపు ఆకర్షిస్తాం. ఈ సదస్సులో మొత్తం 27 సెషన్లు ఉంటాయి. వివిధ రంగాలకు చెందిన నిపుణులను, ప్రముఖులను ఆహ్వానించాం" అని వివరించారు.

ఈ సమ్మిట్‌కు వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు హాజరవుతారని భట్టి తెలిపారు. "ముఖ్య అతిథులకు ఎలాంటి రవాణా సమస్య రాకుండా చూసుకుంటాం. అవసరమైతే ప్రత్యేక విమానం కూడా ఏర్పాటు చేస్తాం. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖులు హాజరుకావడం సమ్మిట్‌కు మరింత శోభను తెస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Mallu Bhatti Vikramarka
Chiranjeevi
Nagarjuna
Telangana Rising Global Summit
Telangana
Telugu Film Industry
Sridhar Babu
Praja Bhavan
Global Summit
Telangana development

More Telugu News