Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్‌గారు’ నుంచి మరో సాంగ్.. ప్రోమో వచ్చేసింది!

Chiranjeevis Mana Shankara Vara Prasad Second Song Promo Released
  • చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రం నుంచి రెండో పాట
  • ‘శశిరేఖ’ పేరుతో రానున్న కొత్త సాంగ్
  • ఈ నెల‌ 08న పాట విడుదల చేస్తున్నట్లు ప్రకటన
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో భారీ తారాగణంతో సినిమా
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ (MSG) నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేసేందుకు చిత్ర బృందం తేదీని ఖరారు చేసింది. ‘శశిరేఖ’ పేరుతో రానున్న ఈ పాటను ఈ నెల‌ 8న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా పాటకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ప్రోమోను కూడా అభిమానులతో పంచుకుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన తొలి పాట ‘మీసాల పిల్ల’ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఆ పాట విజయంతో ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉండగా, ఇప్పుడు రెండో పాట అప్‌డేట్ వారిలో మరింత జోష్ నింపింది.

ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్‌తో పాటు విక్టరీ వెంకటేశ్, నయనతార, కేథరిన్ థ్రెసా వంటి భారీ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, వి. హరికృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Chiranjeevi
Mana Shankara Vara Prasad
MSG Movie
Shashirekha Song
Anil Ravipudi
Venkatesh
Nayanthara
Catherine Tresa
Telugu Movie

More Telugu News