Redmi 15C: రూ. 12 వేలకే రెడ్ మీ 5జీ ఫోన్.. ఏమేం ఫీచర్స్ ఉన్నాయంటే..!

Redmi 15C 5G Phone Launched in India Features Price
  • మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన రెడ్ మీ
  • 6 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.9 ఇంచెస్ డిస్ ప్లే
  • 4జీబీ ర్యామ్ 128జీబీ ఇన్ బిల్ట్ మెమరీ
రెడ్‌ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్ మార్కెట్లోకి విడుదలైంది. తక్కువ బడ్జెట్‌లో భారీ డిస్‌ప్లే, అత్యుత్తమ కెమెరా, బిగ్ బ్యాటరీ కోరుకునే వినియోగదారుల కోసం సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెడ్‌మీ 15సీ స్మార్ట్ ఫోన్ ను గురువారం భారత్ లో రిలీజ్ చేసింది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్ విషయానికి వస్తే.. రెడ్‌మీ 15సీ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్లు, మూడు రంగుల్లో తీసుకొచ్చింది. మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌లైట్ బ్లూ, డస్క్ పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. డిసెంబర్ 11 నుంచి అమ్మకాలు మొదలవుతాయి.

  • 4 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ.12,499 
  • 6 జీబీ ర్యామ్ 128 జీబీ మెమరీ వేరియెంట్ ధర రూ.13,999 
  • 8 జీబీ ర్యామ్ 128 జీబీ మెమరీ వేరియెంట్ ధర రూ.15,499

ఇతర ఫీచర్స్..
  • 6.9 అంగుళాల హెచ్‌డీ అడాప్టివ్‌సింక్ డిస్‌ప్లే 
  • 120Hz రిఫ్రెష్ రేట్‌, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది.
  • వినియోగదారుడి కళ్లపై తక్కువ ఒత్తిడి కలిగించేలా TUV రీన్‌ల్యాండ్ సర్టిఫైడ్‌ డిస్‌ప్లే. 
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, హైపర్ఓఎస్ 2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.
  • 50 ఎంపీ ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ (33W ఫాస్ట్ చార్జింగ్‌తో 28 నిమిషాల్లో 50 శాతం చార్జ్) 
  • 5జీ, వైఫై, బ్లూటూత్, ఐఆర్ బ్లాస్టర్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్
Redmi 15C
Redmi
5G smartphone
budget phone
MediaTek Dimensity 6300
6000mAh battery
120Hz refresh rate
HyperOS 2
50MP camera
smartphone price

More Telugu News