Brazil gym accident: జిమ్ లో కసరత్తు చేస్తుండగా జారిపడ్డ బార్బెల్.. వ్యక్తి మృతి.. వీడియో ఇదిగో!

Gym accident Ronald Montenegro killed by falling barbell
  • బ్రెజిల్ లోని ఒలిండా నగరంలో ఘటన
  • ఛాతీపై బార్బెల్ పడడంతో అంతర్గత గాయాలు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన 55 ఏళ్ల వ్యక్తి
బ్రెజిల్‌లోని ఒలిండా నగరంలో ఉన్న ఓ జిమ్‌ లో విషాదం చోటుచేసుకుంది. బెంచ్ ప్రెస్ చేస్తుండగా బార్బెల్ పట్టుజారి ఛాతీపై పడడంతో రొనాల్డ్ మోంటెనెగ్రో (55) అనే వ్యక్తి మరణించాడు. ఈ నెల 1న జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తాజాగా వెలుగులోకి వచ్చింది. వీడియోలోని వివరాల ప్రకారం.. మోంటెనెగ్రో ఒంటరిగా బెంచ్ ప్రెస్ ఎక్సర్‌సైజ్ చేస్తుండగా ఉన్నట్టుండి బార్బెల్ ఆయన చేతుల్లోంచి జారి, నేరుగా ఛాతీపై పడింది.

వెంటనే ఆయన దానిని పక్కకి తొలగించి, పైకి లేచారు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే కిందపడిపోయారు. అప్రమత్తమైన జిమ్ సిబ్బంది, తోటి సభ్యులు అతనికి ప్రథమ చికిత్స అందించి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మోంటెనెగ్రో మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఇది ప్రమాదవశాత్తు జరిగిందని నిర్ధారించారు.
Brazil gym accident
Olinda gym
Barbell accident
Bench press
Gym death
Weightlifting accident
Fitness accident
Ronald Montenegro

More Telugu News