ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా విక్రమ్ పూల.. ఉత్తర్వుల జారీ

  • రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్న విక్రమ్
  • ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
  • ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు వాడకంపై తనిఖీలకు అధికారం
మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం నూతన అధ్యక్షుడిగా పి. త్రివిక్రమరావు (విక్రమ్ పూల) నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 
 
ఈ నియామకంతో పాటు అధికార భాషా సంఘం నిర్వర్తించాల్సిన కీలక బాధ్యతలను, కార్యాచరణను కూడా ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో ఆంగ్ల భాష వాడకాన్ని నియంత్రించి, తెలుగు వినియోగాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది.
 
ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో తెలుగు వాడకం ఏ స్థాయిలో ఉందో తనిఖీలు చేసే అధికారాన్ని సంఘానికి కల్పించింది. తనిఖీల అనంతరం సంబంధిత అధికారులకు తగిన సూచనలు ఇవ్వాలని పేర్కొంది. తెలుగు భాష వినియోగంలో సాధించిన ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, అధికార భాషాభివృద్ధికి అవసరమైన సిఫార్సులతో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలని కూడా ప్రభుత్వ ఉత్తర్వుల్లో వివరించింది.
 


More Telugu News