తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్... సోనియా గాంధీ సందేశం
- రాష్ట్ర అభివృద్ధిలో ఈ సదస్సు కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం
- కీలక ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగస్వాములు కావాలనుకునే వారికి ఈ సదస్సు వేదిక అన్న సోనియా గాంధీ
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ అభినందనలు
తెలంగాణలో జరగనున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ స్పందించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఈ సమ్మిట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆమె సందేశం పంపించారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగస్వాములు కావాలనుకునే వారికి ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని అన్నారు.
అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ వ్యవసాయాభివృద్ధి ప్రాజెక్టులకు సమ ప్రాధాన్యం ఇచ్చేలా మూడంచెల వ్యూహంతో తెలంగాణ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. తెలంగాణలోని మానవ, సహజ వనరులు, ప్రజల వ్యాపార, సాంకేతిక నైపుణ్యాలు, అంతర్జాతీయ ప్రతిభ అభివృద్ధికి ఈ సదస్సు మరింత తోడ్పడుతుందని అన్నారు.
ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సును నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు.