తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా.. అవసరమైతే ఢిల్లీతో కొట్లాడతా: రేవంత్ రెడ్డి
- రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటానని రేవంత్ రెడ్డి హామీ
- ప్రజల ఆశీర్వాదం ఉంటే ఢిల్లీనైనా ఎదుర్కొంటానని వ్యాఖ్య
- నిధులు ఇవ్వకుంటే కొట్లాడుతానన్న రేవంత్ రెడ్డి
ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి నిధులు అడగడం, అనుమతులు కోరడం ముఖ్యమంత్రిగా తన బాధ్యత అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయాల కోసం ఎంత దూరమైనా వెళ్లే ఓపిక, వయస్సు తనకు ఉన్నాయని, సమస్యను వివరించే పరిజ్ఞానం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.