Vangalapudi Anita: రేవతి పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని తెలిసి ఆనందపడ్డాను: హోంమంత్రి అనిత

Vangalapudi Anita Happy about Constable Revathi Giving Birth to a Baby
  • మహిళా కానిస్టేబుల్ రేవతికి సీమంతం చేసిన హోంమంత్రి అనిత
  • పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కానిస్టేబుల్
  • విశాఖలో విధుల్లో ఉన్న రేవతిని పలకరించి, చిన్నారిని ఆశీర్వదించిన మంత్రి
  • ఇదొక మరిచిపోలేని అనుభూతి అంటూ మంత్రి అనిత వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఒక మహిళా కానిస్టేబుల్ పట్ల తనకున్న ఆత్మీయతను చాటుకున్నారు. తాను సోదరిలా భావించి సీమంతం జరిపిన మహిళా కానిస్టేబుల్ రేవతి పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఆ చిన్నారిని తన చేతులతో ఆశీర్వదించడం మరిచిపోలేని అనుభూతి అని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు.

"మహిళా దినోత్సవ వేళ సోదరిగా భావించి ఓ మహిళా కానిస్టేబుల్ కు సీమంతం నిర్వహించాను. ఆ సోదరి రేవతి ఇప్పుడు పండంటిబిడ్డకు జన్మనిచ్చిందని తెలిసి ఆనందపడ్డాను. విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్ లో జరిగిన కార్యక్రమానికి హాజరైన సందర్భంలో అక్కడ విధులు నిర్విహిస్తున్న కానిస్టేబుల్ రేవతిని పలకరించడం జరిగింది. ఆడపిల్లకు జన్మనిచ్చినట్టు చెప్పింది. రేవతి భర్త బిడ్డను నాకు అందించి ఆశీర్వదించాలని కోరారు. రేవతికి సీమంతం చేసిన చేతులతోనే ఆ చిన్నారికి ఆశీర్వాదాలు అందించడం మరిచిపోలేని అనుభూతి" అని పేర్కొన్నారు.
Vangalapudi Anita
Andhra Pradesh
Home Minister
Revathi
Woman Constable
Seemantham
Visakhapatnam
AU Convention
Childbirth
Women's Day

More Telugu News