Emirates Flight: విమానాన్ని పేల్చేస్తాం: హైదరాబాద్ వస్తున్న ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపు

Emirates Flight Receives Bomb Threat Enroute to Hyderabad
  • హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ కస్టమర్ సపోర్ట్ కేంద్రానికి ఈ-మెయిల్ బెదిరింపు
  • అధికారులు అప్రమత్తం.. సురక్షితంగా విమానం ల్యాండింగ్
  • తనిఖీలు నిర్వహించగా లభించని అనుమానాస్పద వస్తువులు
దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానాన్ని పేల్చేస్తామంటూ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన ఎయిర్‌పోర్ట్ కస్టమర్ సపోర్ట్ కేంద్రానికి ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందింది. అప్రమత్తమైన అధికారులు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి ప్రయాణికులను కిందకు దించారు. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు.

హైదరాబాద్ నగరానికి వచ్చే విమానాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల బాంబు బెదిరింపులు వస్తున్నాయి. గురువారం కూడా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చే విమానాలను లక్ష్యంగా బాంబు బెదిరింపులు వచ్చాయి.

సౌదీ అరేబియాలోని మదీనా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు రావడంతో దానిని అహ్మదాబాద్‌కు మళ్లించి తనిఖీలు నిర్వహించారు. షార్జా నుంచి నగరానికి వస్తున్న మరో విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది.
Emirates Flight
Hyderabad Airport
Bomb threat
Rajiv Gandhi International Airport

More Telugu News