AP Government: 2026లో 24 సాధారణ, 21 ఐచ్ఛిక సెలవులు.. జాబితా విడుదల చేసిన ఏపీ సర్కార్

AP Government Announces Holidays List for 2026
  • మొత్తం 24 రోజులు పబ్లిక్ హాలిడేస్‌గా గుర్తింపు
  • సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండుగలకు సెలవులు
  • 21 ఐచ్చిక సెలవులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన అధికారిక సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు మొత్తం 24 రోజులను సాధారణ సెలవు దినాలుగా (పబ్లిక్ హాలిడేస్), 21 రోజులను ఐచ్ఛిక సెలవులుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, ఉద్యోగులు, ప్రజలు తమ కార్యకలాపాలను ముందుగా ప్రణాళిక చేసుకునేందుకు వీలుగా ఈ జాబితాను ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది.

ప్రధాన పండుగలు, జాతీయ దినోత్సవాలకు అనుగుణంగా ఈ సెలవులను ఖరారు చేశారు. జనవరిలో భోగి, సంక్రాంతి, కనుమ, రిపబ్లిక్ డేలతో సెలవులు ప్రారంభం కానున్నాయి. మార్చిలో ఉగాది, రంజాన్, శ్రీరామనవమి వంటి ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం, సెప్టెంబర్‌లో వినాయక చవితి, అక్టోబర్‌లో దుర్గాష్టమి, విజయదశమి, నవంబర్‌లో దీపావళి, డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగలకు సెలవులు ప్రకటించారు.

2026లో ప్రభుత్వ సెలవుల పూర్తి జాబితా ఇలా ..

* భోగి – జనవరి 14
* మకర సంక్రాంతి – జనవరి 15
* కనుమ – జనవరి 16
* రిపబ్లిక్ డే – జనవరి 26
* మహా శివరాత్రి – ఫిబ్రవరి 15
* హోలీ – మార్చి 3
* ఉగాది – మార్చి 19
* రంజాన్ – మార్చి 20
* శ్రీరామనవమి – మార్చి 27
* గుడ్ ఫ్రైడే – ఏప్రిల్ 3
* బాబు జగ్జీవన్‌రామ్ జయంతి – ఏప్రిల్ 5
* అంబేద్కర్ జయంతి – ఏప్రిల్ 14
* బక్రీద్ – మే 27
* మొహర్రం – జూన్ 25
* స్వాతంత్ర్య దినోత్సవం – ఆగస్టు 15
* వరలక్ష్మి వ్రతం – ఆగస్టు 21
* మిలాద్-ఉన్-నబి – ఆగస్టు 25
* శ్రీకృష్ణాష్టమి – సెప్టెంబర్ 4
* వినాయక చవితి – సెప్టెంబర్ 14
* గాంధీ జయంతి – అక్టోబర్ 2
* దుర్గాష్టమి – అక్టోబర్ 18
* విజయదశమి – అక్టోబర్ 20
* దీపావళి – నవంబర్ 8
* క్రిస్మస్ – డిసెంబర్ 25 
AP Government
Andhra Pradesh
AP holidays 2026
Government holidays
Public holidays
Optional holidays
Festival holidays
2026 calendar
AP Govt
List of holidays

More Telugu News