తమిళనాడులో వృద్ధురాలిపై చేయి చేసుకున్న మాజీ ఎమ్మెల్యే
- సేలం జిల్లాలోని కామెనేరి గ్రామంలో ఘటన
- కెమెరా కంటికి చిక్కిన వృద్ధురాలిపై మాజీ ఎమ్మెల్యే దాడి వీడియో
- తన భూమిలో రోడ్డు వేయడంతో అడ్డుకున్న వృద్ధురాలు
తమిళనాడులోని సేలం జిల్లా కామెనేరి గ్రామంలో రోడ్డు పనులకు సంబంధించిన భూ వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఒక వృద్ధురాలిపై అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే దాడి చేయగా, ఆ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామంలో రోడ్డు నిర్మాణం జరుగుతోంది. వృద్ధురాలి ఇంటికి సమీపంలో రోడ్డు వేయాలని నిర్ణయించగా, తన భూమిలో రోడ్డు నిర్మాణం చేపట్టడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.
తన భూమిలో రోడ్డు వేయవద్దని, సమీపంలోని ప్రభుత్వ భూమిలో వేయాలని డిమాండ్ చేస్తూ ఆమె నిరసన చేపట్టింది. ఈ క్రమంలో అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే అర్జునన్, వృద్ధురాలి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ నేపథ్యంలో ఆయన ఆగ్రహించి, ఆ మహిళ చెంపపై రెండుసార్లు కొట్టాడు. ఆమె ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా కర్రతోనూ కొట్టాడు. ఈ ఘటనలో వృద్ధురాలు గాయపడటంతో ఆమెను ఓమలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆమె కోలుకున్న తర్వాత అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే అర్జునన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వృద్ధురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. వృద్ధురాలిపై మాజీ ఎమ్మెల్యే దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కాగా, అర్జునన్ గతంలో డీఎంకే, డీఎండీకే పార్టీలలో కూడా పనిచేశారు.