Raj Nidimoru: నిద్రలేని రాత్రులు గడిపా.. రాజ్ నిడిమోరు మాజీ భార్య ఎమోషనల్ పోస్ట్
- సమంతను వివాహం చేసుకున్న దర్శకుడు రాజ్ నిడిమోరు
- మూడు రోజులకే స్పందించిన మాజీ భార్య శ్యామలీ దే
- మానసిక ఒత్తిడిపై ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్
- ఇది సానుభూతి కోసం కాదంటూ వివరణ
- శ్యామలీ పోస్ట్‌కు సోషల్ మీడియాలో పెరుగుతున్న మద్దతు
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు, నటి సమంత వివాహం జరిగిన మూడు రోజులకే ఆయన మాజీ భార్య శ్యామలీ దే చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన వ్యక్తిగత జీవితంలోని మానసిక ఒత్తిడి, భావోద్వేగ క్షోభను ఆమె ఈ పోస్ట్‌లో పంచుకున్నారు. ఈ నెల 1న కోయంబత్తూరులోని లింగ భైరవి సన్నిధిలో రాజ్, సమంతల వివాహం జరిగిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో శ్యామలీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సుదీర్ఘమైన నోట్‌ను పంచుకున్నారు. "కష్ట సమయాల్లో నాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నాపై ప్రేమ చూపిస్తున్న వారికి స్పందించనందుకు క్షమించండి" అని పేర్కొన్నారు. తనకు పీఆర్ టీం గానీ, సోషల్ మీడియాను నిర్వహించేవారు గానీ లేరని, తన జీవితంలోని మార్పులపై వ్యక్తిగతంగానే స్పందిస్తున్నానని స్పష్టం చేశారు. ఈ పోస్ట్ సానుభూతి కోసం కాదని, కేవలం తన హృదయంలోని భావాలను పంచుకోవడానికేనని వివరించారు.
అంతేకాకుండా తన జ్యోతిష్య గురువుకు నవంబర్ 9న స్టేజ్ 4 క్యాన్సర్ నిర్ధారణ అయిందని, అది మెదడుతో పాటు ఇతర అవయవాలకు వ్యాపించిందని శ్యామలీ ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రస్తుతం నా దృష్టి ఎక్కడ ఉందో మీరు అర్థం చేసుకోగలరు" అంటూ తన ప్రాధాన్యతలను తెలిపారు. మాజీ భర్త రెండో పెళ్లి చేసుకున్న తరుణంలో ఆమె ఎంతో ధైర్యంగా, నిజాయతీగా తన భావాలను పంచుకోవడం పట్ల నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.