GHMC: జీహెచ్ఎంసీ విస్తరణ ప్రక్రియ.. నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం

GHMC Expansion Process Government Releases Notification
  • గ్రేటర్ హైదరాబాద్ శివారులోని మున్సిపాలిటీలను విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం
  • మంత్రివర్గ నిర్ణయానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం
  • 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) విస్తరణ ప్రక్రియ పూర్తయింది. గ్రేటర్ హైదరాబాద్ శివారులోని పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయానికి జిష్ణుదేవ్ వర్మ సోమవారం ఆమోదం తెలిపారు. దీంతో హైదరాబాద్ నగర పరిధిలోని మొత్తం 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

నిన్నటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాధ్యతలను డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు అప్పగించింది.
GHMC
GHMC expansion
Hyderabad
Telangana government
Municipalities merger

More Telugu News