YS Sunitha: వైఎస్ వివేకా హత్య కేసులో లోతైన విచారణ జరగాలి: సీబీఐ కోర్టులో వైఎస్ సునీత న్యాయవాది

YS Sunitha Advocate Argues for Deeper Probe in YS Viveka Murder Case
  • లేదంటే అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందన్న న్యాయవాది
  • సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ వేసేలా సీబీఐని ఆదేశించాలని విజ్ఞప్తి
  • తీర్పును ఈ నెల 10కి వాయిదా వేసిన న్యాయమూర్తి
దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో లోతైన విచారణ జరగాలని, లేదంటే అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందని వైఎస్ సునీత తరఫు న్యాయవాది అన్నారు. తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ కుమార్తె వైఎస్ సునీత నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.

అసలు నిందితులు తప్పించుకోకుండా ఈ కేసు విచారణ జరపాలని ఆమె కోరారు. సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ వేసేలా సీబీఐని ఆదేశించాలని కోరారు. దర్యాప్తు కొనసాగితే సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని కూడా సునీత అభిప్రాయపడ్డారు. దర్యాప్తు కొనసాగించే అవకాశం లేదని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 10న తీర్పును వెలువరించనుంది.
YS Sunitha
YS Vivekananda Reddy
Viveka Murder Case
CBI Court
Nampally CBI Court
Andhra Pradesh Politics

More Telugu News