Temba Bavuma: అప్పుడు నేను స్కూల్లో చదువుకుంటున్నా: దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా

Temba Bavuma recalls schooling during Rohit Sharmas 2007 World Cup
  • రెండో వన్డేకు అందుబాటులోకి వచ్చిన సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా
  • రోహిత్, కోహ్లీ రాకతో భారత్ బలపడిందన్న సఫారీ సారథి
  • 2007లో రోహిత్ ఆడుతుంటే తాను స్కూల్లో ఉన్నానని వ్యాఖ్య
భారత్‌తో జరగనున్న రెండో వన్డేకు ముందు దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్న సమయంలో తాను ఇంకా పాఠశాలలో చదువుకుంటున్నానని గుర్తు చేసుకున్నాడు. తొలి వన్డేకు దూరమైన బవుమా, రాయ్‌పూర్ వేదికగా బుధవారం జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు.

మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బవుమా మాట్లాడుతూ.. రోహిత్, విరాట్ కోహ్లీ రాకతో భారత జట్టు మరింత బలోపేతమైందని అంగీకరించాడు. అయితే, వారిని ఎదుర్కోవడం తమకు కొత్తేమీ కాదని స్పష్టం చేశాడు. కోహ్లీ, రోహిత్ ప్రపంచ స్థాయి ఆటగాళ్లని, అయినా వారితో తాము చాలా మ్యాచ్‌లు ఆడామని తెలిపారు. కొన్నిసార్లు తాము పైచేయి సాధించామన్నారు. ఈ సవాళ్లు సిరీస్‌ను మరింత ఉత్తేజకరంగా మారుస్తాయని బవుమా వివరించాడు.

ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (135) అద్భుత శతకంతో కదం తొక్కగా, కెప్టెన్ రోహిత్ శర్మ (57) అర్ధశతకంతో రాణించాడు. ఈ నేపథ్యంలో రాయ్‌పూర్‌లో జరిగే రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ మైదానంలో భారత్ గతంలో ఆడిన ఏకైక వన్డేలో ఘన విజయం సాధించడం గమనార్హం. 
Temba Bavuma
South Africa cricket
India vs South Africa
Rohit Sharma
Virat Kohli
2007 T20 World Cup
cricket news
India cricket
South Africa captain
IND vs SA

More Telugu News