Samantha Ruth Prabhu: సమంత పెళ్లి రోజే నాగచైతన్య పోస్ట్.. సోషల్ మీడియాలో చర్చ

Naga Chaitanyas Post on Samanthas Wedding Day Attracts Netizen Comments
  • దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లాడిన సమంత
  • ఈశా యోగా సెంటర్‌లో నిరాడంబరంగా వివాహం
  • తన వెబ్ సిరీస్ 'దూత'పై నాగచైతన్య పెట్టిన పోస్ట్ వైరల్
ప్రముఖ నటి సమంత దర్శకుడు రాజ్ నిడిమోరును రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న ఉదయం వీరి వివాహం జరిగింది. కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో జరిగిన ఈ వేడుకకు కేవలం 30 మంది అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా జరిగిన ఈ పెళ్లి వార్త సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. ఆసక్తికరంగా, సమంత మాజీ భర్త నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల మొదటి వివాహ వార్షికోత్సవానికి (డిసెంబర్ 4) కేవలం మూడు రోజుల ముందు ఈ వివాహం జరగడం గమనార్హం. 

మరోవైపు, సమంత పెళ్లి వార్త బయటకు వచ్చిన సమయంలోనే... నాగచైతన్య తన అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ 'దూత' గురించి ఒక పోస్ట్ చేశారు. "ఒక నటుడిగా సృజనాత్మకత, నిజాయతీతో ఒక ప్రాజెక్ట్ ఎంచుకుని, మన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ప్రజలు దానికి కనెక్ట్ అవుతారని 'దూత' నిరూపించింది. వారు ఆ ఎనర్జీని స్వీకరించి, తిరిగి మనకు అందిస్తారు. 'దూత' విడుదలై రెండేళ్లు పూర్తయ్యాయి. దీన్ని సాధ్యం చేసిన టీమ్‌కు ధన్యవాదాలు" అని తన పోస్టులో రాశారు. 

మరోవైపు నాగచైతన్య పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సమంత పెళ్లి రోజే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాల్సిన అవసరం ఏముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. రెండేళ్ల నాటి వెబ్ సిరీస్ గురించి ఇప్పుడు అవసరమా? అని మరికొందరు కామెంట్ పెట్టారు.
Samantha Ruth Prabhu
Samantha marriage
Samantha second marriage
Naga Chaitanya
Sobhita Dhulipala
Dhootha web series
Raj Nidimoru
Eesha Yoga Center
Samantha wedding
Telugu cinema news

More Telugu News