LOC: సరిహద్దుల్లో పొంచి ఉన్న 120 మంది పాక్ ఉగ్రవాదులు: బీఎస్ఎఫ్​

BSF IG Ashok Yadav Alerts on 120 Terrorists Near Border
  • ఆపరేషన్ సిందూర్ తర్వాత కూడా సరిహద్దుల్లో 69 ఉగ్రస్థావరాలు యాక్టివ్
  • ఇటీవల బార్డర్ దాటే ప్రయత్నం చేసిన 8 మంది టెర్రరిస్టుల కాల్చివేత
  • ఉగ్రవాదుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని బీఎస్ఎఫ్ ఐజీ వెల్లడి
‘ఆపరేషన్ సిందూర్’ లో పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం తుడిచిపెట్టిన విషయం విదితమే. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న ఈ క్యాంపులను భారత వైమానిక దళం ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో హతమయ్యారు. అయితే, ఇప్పటికీ ఇంకా ఉగ్రస్థావరాలు మిగిలే ఉన్నాయని, అక్కడ ఉగ్ర కార్యకలాపాలు జరుగుతున్నాయని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఐజీ అశోక్ యాదవ్ వెల్లడించారు. నియంత్రణ రేఖకు ఆవలివైపు ప్రస్తుతం 69 ఉగ్రస్థావరాలు యాక్టివ్ గా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ క్యాంపుల్లో సుమారు 100 నుంచి 120 మంది ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

భారత్ లోకి చొరబడేందుకు అవకాశం కోసం చూస్తున్నారని వివరించారు. అయితే, ఉగ్రవాదుల కదలికలను నిరంతరం గమనిస్తున్నామని ఆయన వివరించారు. ఇటీవల ఎనిమిది మంది ఉగ్రవాదులు సరిహద్దులు దాటి భారత్ లోకి అడుగుపెట్టేందుకు విఫలయత్నం చేశారని అశోక్ యాదవ్ చెప్పారు. చొరబాటుకు నాలుగుసార్లు ప్రయత్నించిన ఆ ఎనిమిది మంది ఉగ్రవాదులను బీఎస్ఎఫ్ మట్టుబెట్టిందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ లో బీఎస్ఎఫ్ కీలకంగా వ్యవహరించిందని, సరిహద్దుల్లోని పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడంలో పాలుపంచుకుందని బీఎస్ఎఫ్ ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు.
LOC
Operation Sindoor
BSF
Border Security Force
Pakistan terrorists
Indian Army
Terrorist camps
infiltration
Jammu Kashmir
Ashok Yadav

More Telugu News