: వైసీపీలో గౌరవం లేదు.. మండలి ఛైర్మన్ ఎదుట స్పష్టం చేసిన ఎమ్మెల్సీలు
- రాజీనామా ఆమోదం కోసం మండలి ఛైర్మన్‌ను కలిసిన ఆరుగురు ఎమ్మెల్సీలు
- వైసీపీలో గౌరవం లేకే పార్టీ వీడామన్న మర్రి రాజశేఖర్
- స్వచ్ఛందంగానే రాజీనామా చేశామని స్పష్టం చేసిన ఎమ్మెల్సీలు
వైసీపీకి రాజీనామా చేసిన ఆరుగురు ఎమ్మెల్సీలు శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజుతో భేటీ అయ్యారు. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని వారు ఛైర్మన్‌ను కోరారు. ఎమ్మెల్సీలు జయమంగళ వెంకటరమణ, మర్రి రాజశేఖర్, పద్మశ్రీ, బల్లి దుర్గాప్రసాద్, జకీయా ఖానుమ్, పోతుల సునీత మండలి కార్యాలయానికి వచ్చి ఛైర్మన్‌తో సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా, ప్రలోభాలకు లోనై రాజీనామాలు చేశారా? అని ఛైర్మన్ మోషేన్ రాజు ఎమ్మెల్సీలను ప్రశ్నించారు. ముఖ్యంగా, జనసేనలో చేరితే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారా? అని జయమంగళను అడిగారు. దీనికి జయమంగళ స్పందిస్తూ.. తాను స్వచ్ఛందంగానే వైసీపీని వీడి జనసేనలో చేరానని, తన వ్యాపార, రాజకీయ అవసరాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తన రాజీనామాపై నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
మరో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ, వైసీపీలో తమకు విలువ, గౌరవం లేకపోవడం వల్లే రాజీనామా చేశామన్నారు. టీడీపీలో వైసీపీ కన్నా ఎక్కువ ప్రజాస్వామ్యం ఉందని అభిప్రాయపడ్డారు. తాను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడిననే టీడీపీలో చేరుతున్నాననడం సరికాదని స్పష్టం చేశారు.
పదవీకాలం తక్కువగా ఉన్నందున పునరాలోచించుకోవాలని ఛైర్మన్ వారికి సూచించారు. అయితే, ఎమ్మెల్సీలు తాము స్వచ్ఛందంగానే రాజీనామాలు చేశామని, వైసీపీలో కొనసాగే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆరుగురు ఎమ్మెల్సీల రాజీనామాలపై ఛైర్మన్ మోషేన్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.