: బంగాళాఖాతంలో భూకంపం

  • రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైన తీవ్రత
  • ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని వెల్లడి
  • గత నెలలో హిందూ మహాసముద్రంలోనూ భూప్రకంపనలు
బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించింది. ఉదయం సుమారు 7:26 గంటల సమయంలో, సముద్ర గర్భంలో 35 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు గుర్తించారు.
 
ఈ భూప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఎన్‌సీఎస్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. దీంతో తీరప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
 
ఇదిలా ఉండగా, గత నవంబర్ 21న హిందూ మహాసముద్రం ప్రాంతంలో కూడా ఇదే తరహాలో భూకంపం సంభవించింది. ఆ సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా, 10 కిలోమీటర్ల లోతున నమోదైందని ఎన్‌సీఎస్ తన నివేదికలో పేర్కొంది.

More Telugu News