12వ సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ - 2025కు ఏపీ మంత్రి దుర్గేశ్
- ముంబైలో సీఐఐ సదస్సుకు ఏపీ మంత్రి దుర్గేశ్
- "ఆంధ్రా వ్యాలీ"గా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యమన్న మంత్రి
- యానిమేషన్, గేమింగ్, వీఎఫ్ఎక్స్‌లో పెట్టుబడుల ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముంబైలో పర్యటించనున్నారు. డిసెంబర్ 1, 2 తేదీల్లో ముంబైలోని జుహూ జేడబ్ల్యూ మారియట్ హోటల్‌లో జరగనున్న 12వ సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ - 2025 కు ఆయన హాజరుకానున్నారు. ఈ పర్యటన నిమిత్తం మంత్రి దుర్గేశ్ నిన్న రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ముంబైకి బయలుదేరి వెళ్లారు.
ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగంలో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగ భవిష్యత్తుపై ఈ సదస్సులో కీలకంగా చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుర్గేశ్.. భారతీయ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమను 100 బిలియన్ డాలర్ల మార్కుకు చేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేయనున్నారు.
రాష్ట్రాన్ని సృజనాత్మక రంగాలకు "ఆంధ్రా వ్యాలీ"గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుర్గేశ్ తెలిపారు. కంటెంట్ క్రియేషన్ కోసం ఏఐ ఆధారిత టూల్స్, ఎక్స్ఆర్ టెక్నాలజీలు, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా యానిమేషన్, గేమింగ్, వీఎఫ్ఎక్స్ రంగాలకు ఏపీని గ్లోబల్ హబ్‌గా మారుస్తామని ఆయన వివరించనున్నారు. సుస్థిరమైన, పారదర్శకమైన పాలన అందిస్తున్నామని, ఫిల్మ్ టూరిజంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించనున్నారని ఆయన కార్యాలయం తెలిపింది.