Dithva Cyclone: దిత్వా తుఫాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు

Dithva Cyclone Heavy Rains Disrupt Tamil Nadu Flights
  • వర్షాల నేపథ్యంలో పలు విమాన సర్వీసులు రద్దు
  • అడ్వైజరీ జారీ చేసిన ఎయిరిండియా, ఇండిగో సంస్థలు
  • 54 విమాన సర్వీసులు రద్దు చేసినట్లు చెన్నై విమానాశ్రయ అధికారులు వెల్లడి
దిత్వా తుఫాను ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇండిగో, ఎయిరిండియా సంస్థలు ఇప్పటికే ప్రయాణికులకు సూచనలు జారీ చేశాయి. ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది.

భారీ వర్షాల నేపథ్యంలో వివిధ జిల్లాలకు నడిచే 54 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు చెన్నై విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.

విమానాశ్రయానికి బయలుదేరే ముందు విమాన సర్వీసు స్టేటస్‌ను పరిశీలించుకోవాలని ఎయిరిండియా, ఇండిగో సూచించాయి. భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా చెన్నైతో సహా దక్షిణాది నగరాల నుంచి రాకపోకలు సాగించే సర్వీసులపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయా సంస్థలు పేర్కొన్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కూడా అప్రమత్తమైంది.
Dithva Cyclone
Tamil Nadu rains
Chennai rains
Flight cancellations
Tamil Nadu cyclone
School holidays Tamil Nadu

More Telugu News