ఏపీకి కొత్త సీఎస్.. 2026 మార్చి నుంచి బాధ్యతలు
- ఏపీ తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్
- 2026 మార్చి 1 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరణ
- ప్రస్తుత సీఎస్ కె.విజయానంద్‌కు మూడు నెలల పదవీకాలం పొడిగింపు
- పది మంది డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్‌లు ఇస్తూ మరో ఉత్తర్వు
ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పొడిగించింది. దీనితో ఆయన 2026 మార్చి 28 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ పొడిగింపునకు సంబంధించి జీవో నంబర్ 2230ను ప్రభుత్వం విడుదల చేసింది.
మరోవైపు రాష్ట్రంలో పది మంది డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్‌లు ఇస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఆర్టీ నెంబర్ 2228ను ప్రస్తుత సీఎస్ విజయానంద్ విడుదల చేశారు. పరిపాలనాపరమైన ఈ మార్పులపై ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులను జారీ చేయడంతో స్పష్టత వచ్చింది.