బస్సు ప్రమాదాలపై ఎన్ హెచ్చార్సీ స్పందన.. రాష్ట్రాలకు కీలక ఆదేశాల జారీ
- నిబంధనలకు అనుగుణంగాలేని బస్సులను పక్కన పెట్టాలని ఆదేశం
- వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో ప్రజల్లో భయాందోళనలు
- ప్రయాణికుల ఫిర్యాదులతో స్పందించిన మానవ హక్కుల కమిషన్
దూరప్రాంతాలకు వెళ్లే స్లీపర్ బస్సుల విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్చార్సీ) రాష్ట్రాలకు కీలక సూచనలు జారీ చేసింది. వరుస బస్సు ప్రమాదాల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతున్న ట్రావెల్ ఏజెన్సీల పట్ల కఠినంగా వ్యవహరించాలని, రూల్స్ కు అనుగుణంగా లేని బస్సులను పక్కన పెట్టాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇటీవల జరిగిన కర్నూలు బస్సు ప్రమాదంతో పాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల రన్నింగ్ బస్సుల్లో మంటలు ఎగిసిపడి ప్రయాణికులు చనిపోయిన విషయం తెలిసిందే.
ఈ ప్రమాదాల నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పలువురు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో తాజాగా మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ప్రైవేటు బస్సుల్లో భద్రతపై జాతీయ రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్లీపర్ బస్సులను పక్కన పెట్టేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రమాదాలపై నివేదికలు ఏం చెబుతున్నాయంటే..

- దూరప్రాంతాలకు వెళ్లే స్లీపర్ బస్సుల్లో సగానికి పైగా ఏసీ బస్సులే. బస్సు లోపలి భాగం ఇరుకుగా ఉండడంతో ప్రమాదం జరిగినపుడు వెంటనే బయటపడే అవకాశం తక్కువ.
- బస్సుల కండిషన్ పై తనిఖీల విషయంలో ట్రావెల్స్ కంపెనీలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి.
- నిబంధనల ప్రకారం ప్రతీ బస్సులోనూ అగ్ని ప్రమాదాలను నియంత్రించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కానీ ఇప్పుడు నడుస్తున్న బస్సుల్లో చాలావరకు ఇలాంటి వ్యవస్థ ఏదీ లేదు.
- అదనపు ఆదాయం కోసం ఎమర్జెన్సీ డోర్ వద్ద కూడా సీటు ఏర్పాటు చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు బయటపడే అవకాశాలు తగ్గుతున్నాయి.