రెండు వేదికల్లో డబ్ల్యూపీఎల్ 2026 మ్యాచ్‌లు.. పూర్తి షెడ్యూల్ ఇదే!

  • జనవరి 9న డబ్ల్యూపీఎల్ 2026 సీజన్ ప్రారంభం
  • తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ
  • నవీ ముంబై, వడోదర నగరాల్లో మ్యాచ్‌ల నిర్వహణ
  • ఫిబ్రవరి 5న వడోదరలో ఫైనల్ పోరు
  • తొలిసారిగా జనవరి-ఫిబ్రవరి నెలల్లో టోర్నీ
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శనివారం విడుదల చేసింది. ఈ మెగా టోర్నీ జనవరి 9న ప్రారంభం కానుండగా, తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, 2024 విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ ఆరంభ మ్యాచ్‌కు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదిక కానుంది.

ఈ సీజన్‌లోని మ్యాచ్‌లను రెండు నగరాల్లో నిర్వహించనున్నారు. తొలి దశలో భాగంగా జనవరి 9 నుంచి 17 వరకు నవీ ముంబైలో 11 మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం టోర్నీ గుజరాత్‌లోని వడోదరకు షిఫ్ట్ అవుతుంది. ప్లేఆఫ్స్‌తో సహా మిగిలిన 11 మ్యాచ్‌లకు వడోదరలోని కోటంబి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 5న ఫైనల్ మ్యాచ్‌ను కూడా ఇక్కడే నిర్వహిస్తారు.

లీగ్ దశ ఫిబ్రవరి 1న ముగియనుండగా, పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఫిబ్రవరి 3న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. టేబుల్ టాపర్‌గా నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. గత మూడు సీజన్లుగా ఫిబ్రవరి-మార్చి నెలల్లో జరిగిన ఈ టోర్నీ, అంతర్జాతీయ మ్యాచ్‌లతో క్లాష్ కాకుండా ఉండేందుకు ఈసారి జనవరి-ఫిబ్రవరి విండోలో నిర్వహిస్తున్నారు.

ఇటీవల ఢిల్లీలో జరిగిన మెగా వేలం తర్వాత జట్లు మరింత బలంగా మారాయని, ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా సాగుతుందని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా తెలిపారు. ఇప్పటివరకు జరిగిన సీజన్లలో ముంబై ఇండియన్స్ రెండుసార్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకసారి టైటిల్ గెలుచుకోగా, ఢిల్లీ క్యాపిటల్స్ మూడుసార్లు రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

పూర్తి షెడ్యూల్ ఇదే..

నవీ ముంబైలో జ‌రిగే మ్యాచ్‌లు..

జనవరి 9: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

జనవరి 10: యూపీ వారియర్జ్ vs గుజరాత్ జెయింట్స్

జనవరి 10: ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్

జనవరి 11: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్

జనవరి 12: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యూపీ వారియర్జ్

జనవరి 13: ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్

జనవరి 14: యూపీ వారియర్జ్ vs ఢిల్లీ క్యాపిటల్స్

జనవరి 15: ముంబై ఇండియన్స్ vs యూపీ వారియర్జ్

జనవరి 16: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్

జనవరి 17: యూపీ వారియర్జ్ vs ముంబై ఇండియన్స్

జనవరి 17: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

వడోదరలో జ‌రిగే మ్యాచ్‌లివే..

జనవరి 19: గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

జనవరి 20: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్

జనవరి 22: గుజరాత్ జెయింట్స్ vs యుపి వారియర్జ్

జనవరి 24: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్

జనవరి 26: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్

జనవరి 27: గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్

జనవరి 29: యుపి వారియర్జ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

జనవరి 30: గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్

ఫిబ్రవరి 1: ఢిల్లీ క్యాపిటల్స్ vs యుపి వారియర్జ్

ఫిబ్రవరి 3: ఎలిమినేటర్

ఫిబ్రవరి 5: ఫైనల్



More Telugu News