Casagrand: ఇదే కదా అసలైన బోనస్.. వెయ్యి మంది ఉద్యోగులకు లండన్ ట్రిప్.. చెన్నై కంపెనీ బంపరాఫర్
- వెయ్యి మంది ఉద్యోగులకు లండన్ ట్రిప్ స్పాన్సర్ చేసిన 'క్యాసగ్రాండ్'
- ప్రాఫిట్ షేర్ బొనాంజాలో భాగంగా ఏటా విదేశీ పర్యటనలు
- భారత్, దుబాయ్‌లోని ఉద్యోగుల నుంచి 15శాతం సిబ్బంది ఎంపిక
- హోదా తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన సౌకర్యాలు
- సంపదను పంచుకోవడంలోనే ఆనందం ఉందన్న కంపెనీ యాజమాన్యం
చెన్నైకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ 'క్యాసగ్రాండ్' తమ ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కంపెనీ ఏటా నిర్వహించే "ప్రాఫిట్ షేర్ బొనాంజా" కార్యక్రమంలో భాగంగా ఈసారి వెయ్యి మంది ఉద్యోగులను వారం రోజుల లండన్ పర్యటనకు పంపింది. సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగుల సేవలను గుర్తించేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు యాజమాన్యం తెలిపింది.
క్యాసగ్రాండ్ సంస్థలో భారత్, దుబాయ్‌లలో కలిపి మొత్తం 7,000 మంది సిబ్బంది పనిచేస్తుండగా, వారిలో సుమారు 15 శాతం మందిని ఈ ట్రిప్ కోసం ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు 6,000 మందికి పైగా ఉద్యోగులు సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా, దుబాయ్, స్పెయిన్ వంటి దేశాల్లో పర్యటించారు. ఈసారి లండన్ యాత్ర కోసం హోదా, ర్యాంకులతో సంబంధం లేకుండా ఎంపికైన ఉద్యోగులందరికీ ఒకే రకమైన ప్రయాణ, వసతి సౌకర్యాలు కల్పించడం విశేషం.
ఈ యాత్రలో భాగంగా ఉద్యోగులు సెయింట్ పాల్స్ కేథడ్రల్, లండన్ బ్రిడ్జ్, బిగ్ బెన్, బకింగ్‌హామ్ ప్యాలెస్, మేడమ్ టుస్సాడ్స్ వంటి ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు. థేమ్స్ నదిలో బోట్ షికారు కూడా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా క్యాసగ్రాండ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ ఎంఎన్ మాట్లాడుతూ.. "ప్రతి ఏటా మా ఉద్యోగుల కోసం ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం మా సంస్థ విలువలని తెలియజేస్తుంది. మా బృందాలే ఈ సంస్థకు ఆత్మ. మేము సంపదను పంచుకోవడాన్ని విశ్వసిస్తాం. మా ఉద్యోగుల్లో చాలామంది తొలిసారి విదేశాలకు వెళ్తుండటం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది" అని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఉద్యోగులలో విధేయత, ప్రేరణను పెంచుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.