Kurnool Road Accident: కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం .. ఐదుగురు మృతి

Kurnool Road Accident Five Killed in Horrific Accident
  • ఎమ్మిగనూరు వద్ద ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు
  • చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి
  • పలువురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
కర్నూలు జిల్లాలో శనివారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని కొటేకల్ గ్రామం వద్ద ప్రధాన రహదారిపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

వివరాల్లోకి వెళితే, ఎమ్మిగనూరు ప్రధాన రహదారిపై వేగంగా ప్రయాణిస్తున్న రెండు కార్లు అదుపు తప్పి ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
Kurnool Road Accident
Kurnool
Road Accident
Andhra Pradesh
Emmiganur
Kotekal
Car Accident
Accident Deaths
Andhra Pradesh Road Safety

More Telugu News