సౌరవ్ గంగూలీ అర్ధాంగికి ఆన్లైన్ వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు
- సోషల్ మీడియా వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన డోనా గంగూలీ
- భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అర్ధాంగిని లక్ష్యంగా చేసుకుని పోస్టులు
- ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శన తర్వాత పెరిగిన అసభ్యకర వ్యాఖ్యలు
- ఫేస్బుక్ పేజీ వివరాలతో ఫిర్యాదు.. పోలీసుల దర్యాప్తు
అసలేం జరిగిందంటే..!
ఇటీవల జరిగిన కోల్‌కతా ఫిల్మ్ ఫెస్టివల్లో డోనా గంగూలీ నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత ఒక ఫేస్బుక్ పేజీలో ఆమెను లక్ష్యంగా చేసుకుని అనుచిత పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. తనను బాడీ షేమింగ్ చేయడంతో పాటు తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టారని డోనా ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఆమె ఠాకూర్‌పుకుర్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుకు మద్దతుగా ఆ పోస్టులకు సంబంధించిన స్క్రీన్షాట్లను, ఫేస్బుక్ పేజీతో సంబంధం ఉన్న ఒక మొబైల్ నంబర్‌ను కూడా ఆమె పోలీసులకు అందించారు. ఈ ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, పోస్టులు పెట్టిన వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.