నక్సలిజంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- వచ్చే డీజీపీల సదస్సు నాటికి నక్సలిజం నిర్మూలిస్తామన్న అమిత్ షా
- మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశం
- పీఎఫ్ఐపై నిషేధం కేంద్ర, రాష్ట్రాల సమన్వయానికి నిదర్శనం
నక్సలిజంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరిగే డీజీపీలు, ఐజీపీల సదస్సు నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నక్సలిజాన్ని సమూలంగా తుడిచిపెట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. రాయ్‌పూర్‌లో నిన్న జరిగిన డీజీపీ, ఐజీపీల వార్షిక సదస్సులో అమిత్ షా ప్రసంగించారు.
ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలో నక్సలిజం, ఈశాన్య రాష్ట్రాల సమస్యలు, జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన అంశాలకు శాశ్వత పరిష్కారం చూపి విజయం సాధించామని ఆయన అన్నారు. దేశ భద్రత, అంతర్గత శాంతి పరిరక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని అమిత్ షా పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలపై ఉక్కుపాదం మోపాలని ఆయన పిలుపునిచ్చారు. డ్రగ్స్ స్మగ్లర్లకు, నేరగాళ్లకు భారత్‌లో స్థానం లేదని గట్టిగా హెచ్చరించారు.
ఈ సందర్భంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై విధించిన నిషేధాన్ని అమిత్ షా ప్రస్తావించారు. పీఎఫ్ఐపై నిషేధం తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన అరెస్టులు, సోదాలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న అద్భుతమైన సమన్వయానికి నిదర్శనమని ఆయన కొనియాడారు. ఇది దేశ భద్రతా చర్యలకు ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిందని వివరించారు.