Ramachander Rao: జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనంపై స్పందించిన బీజేపీ

Ramachander Rao opposes municipalities merger in GHMC
  • 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని మంత్రివర్గం నిర్ణయం
  • మున్సిపాలిటీల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నామన్న రామచందర్ రావు
  • ఈ విలీనం అశాస్త్రీయంగా ఉందన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు
జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనంపై తెలంగాణ బీజేపీ స్పందించింది. నగర పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రెండు రోజుల క్రితం తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. జీహెచ్ఎంసీని విస్తరించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్ బాబు మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఈ నిర్ణయంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు స్పందిస్తూ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో మున్సిపాలిటీల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఈ విలీనం అశాస్త్రీయంగా ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మిత్రపక్షం మజ్లిస్ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు మున్సిపాలిటీలను విలీనం చేస్తోందని ఆరోపించారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు.
Ramachander Rao
GHMC
Telangana BJP
Municipalities Merger
Sridhar Babu
Majlis Party

More Telugu News