Reliance Industries: ముఖేశ్ అంబానీ కంపెనీకి భారీ పెనాల్టీ.. కారణం ఇదే!

Reliance Industries gets Rs 56 crore CGST penalty
  • రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రూ.56.44 కోట్ల జరిమానా
  • అహ్మదాబాద్ జీఎస్టీ శాఖ నుంచి పెనాల్టీ ఉత్తర్వులు
  • ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను బ్లాక్ చేయడంతో వివాదం
  • ఈ నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లనున్నట్లు తెలిపిన రిలయన్స్
దేశంలోని దిగ్గజ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అహ్మదాబాద్‌లోని సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (CGST) జాయింట్ కమిషనర్, కంపెనీకి రూ.56.44 కోట్ల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) విషయంలో ఈ పెనాల్టీ విధించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పీల్‌కు వెళ్లనున్నట్లు రిలయన్స్ స్పష్టం చేసింది.

ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. ఈ నెల‌ 25న జారీ అయిన ఈ ఉత్తర్వులు, తమకు గురువారం ఉదయం 11:04 గంటలకు ఈ-మెయిల్ ద్వారా అందాయని కంపెనీ తెలిపింది. సెంట్రల్ జీఎస్టీ చట్టం, 2017లోని సెక్షన్ 74 కింద ఈ జరిమానా విధించారు.

అయితే, జీఎస్టీ అధికారుల నిర్ణయాన్ని రిలయన్స్ తప్పుబట్టింది. సేవల ప్రదాత (సర్వీస్ ప్రొవైడర్) అందించిన సేవల వర్గీకరణను పరిగణనలోకి తీసుకోకుండానే, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను బ్లాక్డ్ క్రెడిట్‌గా పరిగణించి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించింది. అందుకే ఈ ఉత్తర్వులపై అప్పీల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు వివరించింది.
Reliance Industries
Mukesh Ambani
CGST
Central Goods and Services Tax
Input Tax Credit
ITC
Ahmedabad
Penalty
GST
Tax Evasion

More Telugu News