Hemachandra: విడాకులపై సింగర్ హేమచంద్ర ఘాటు స్పందన.. ఆ విషయం మీకెందుకంటూ ఫైర్
- తన విడాకుల వార్తలపై స్పందించిన సింగర్ హేమచంద్ర
- నా వ్యక్తిగత విషయం మీకెందుకంటూ సూటిగా ప్రశ్నించిన గాయకుడు
- సమాధానం చెప్పాలంటే సరైన కారణం చెప్పాలని షరతు
- శ్రావణ భార్గవి నుంచి హేమచంద్ర విడిపోయారని కొంతకాలంగా ప్రచారం
టాలీవుడ్ గాయకులు హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకులు తీసుకున్నారంటూ కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై హేమచంద్ర తొలిసారి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో విడాకుల అంశంపై యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇవ్వకుండా, ఘాటుగా బదులిచ్చారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న హేమచంద్ర, శ్రావణ భార్గవికి ఒక పాప ఉంది. అయితే, కొన్ని మనస్పర్థల కారణంగా మూడేళ్ల క్రితమే వారు విడాకులు తీసుకుని విడిపోయారని, కానీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హేమచంద్ర తాజా ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించారు.
"విడాకుల వార్త నిజమా? కాదా? అనేది పక్కనపెడితే, ఆ విషయం తెలుసుకోవడం వల్ల మీకు కలిగే ప్రయోజనం ఏంటి? అని నేను అడుగుతున్నా. నా గురించి వచ్చే కామెంట్స్‌ను నేను పట్టించుకోను. నేను ఒక సింగర్‌గా అందరికీ తెలుసు, నా పని గురించి అడగండి. నా మాటల వల్ల ఒక్కరైనా స్ఫూర్తి పొందాలి కానీ, పనికిమాలిన విషయాలకు సమయం లేదు" అని హేమచంద్ర అన్నారు.
అంతేకాకుండా, "నిజంగా ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటే ఒక క్యూ అండ్ ఏ సెషన్ పెడదాం. ఈ విషయం మీకు ఎందుకు ఉపయోగపడుతుందో చెప్తే, ఆ సమాధానం నాకు నచ్చితే అప్పుడు జవాబిస్తాను. పక్కవాళ్ల జీవితాల్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఆసక్తి ఎందుకు? నా గురించి అంతగా తెలుసుకోవాలనుకుంటే నాకు సమయం దొరికే వరకు ఆగండి" అని ఆయన చెప్పుకొచ్చారు.